బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల(Shyamala) పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆమెను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని శ్యామలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఆమె పోలీసుల విచారణకు వెళ్లారు. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విష్ణుప్రియ, రీతూ చౌదరి, టేస్టీ తేజను పోలీసులు విచారించారు.
- Advertisement -
కాగా బెట్టింగ్ యాప్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం విధితమే. బెట్టింగ్స్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిపి మొత్తం 25 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.