వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తన సమీప బంధువు విజయశేఖర్ రెడ్డి మృతి చెందడంతో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన సంగతి తెలిసిందే. ఇవాళ పులివెందులలోని లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను జగన్ పరిశీలించనున్నారు. అనంతరం అరటి రైతులను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి నేరుగా వేంపల్లికి చేరుకుంటారు.
స్థానిక జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. తదుపరి ఇడుపులపాయ చేరుకుని జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికపై జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం తాడేపల్లికి బయలుదేరి వెళతారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.