ఐపీఎల్ 2025 సీజన్‌లో మరొక రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లలో ఓటమిపాలైయ్యాయి.. దీంతో ఈ మ్యాచ్ లో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాయి. కేకేఆర్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోగా, రాజస్థాన్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిని చవిచూసింది. అయితే ఈ రెండు జట్లు బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, బౌలింగ్‌లో బలహీనంగా ఉండటమే పరాజయాన్ని చవిచూశాయి.
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 30 సార్లు ఐపీఎల్ తలపడగా.. 14 మ్యాచ్‌ల్లో రాజస్థాన్, మరో 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించాయి. మరో రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక గౌహతి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌గా పేరొందింది. ఇక్కడ గత టీ20 మ్యాచ్‌లలో 200 పరుగులకు పైగా నమోదయ్యాయి.. దీంతో దీంతో ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశముంది.
కేకేఆర్ జట్టు విషయానికి వస్తే.. కెప్టెన్ అజింక్య రహానే తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సునీల్ నరైన్ ఓపెనింగ్‌లో మెరుగైన ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ కీలక బ్యాట్స్‌మెన్ అయిన డికాక్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రస్సెల్ నిరాశపరిచారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి తేలిపోయాడు, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ ఆరోరాల నుంచి మెరుగైన ప్రదర్శన అవసరం. ఈ లోపాలను కోల్ కతా జట్టు సరిదిద్దుకుంటే విజయం సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
మరోవైపు రాజస్థాన్ జట్టులో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, శుభమ్ దూబే మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరికి యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీష్ రాణాల మద్దతు లభిస్తే, భారీ స్కోరు సాధించవచ్చు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ తొలి మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హక్ ఫరూకీ, తీక్షణ మెరుగైన ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. మరి హోరాహోరీ పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.
అంచనా ప్లేయింగ్ ఎలెవన్:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్.
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హక్ ఫరూఖీ.