ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సోషల్ మీడియా రీల్స్‌లో తెలుగు సినిమా డైలాగ్స్, సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే త్వరలో రాబిన్ హుడ్ చిత్రంలో నటనతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టనున్నాడు. మార్చి 28న రిలీజ్ కానున్న ఈ సినిమా, ప్రీ-రిలీస్ ఈవెంట్‌లో తాజాగా జరిగింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చర్చనీయాంసంగా మారింది. ఇక ఈ ఈవెంట్ సమయంలో రాజేంద్ర ప్రసాద్ తమ చనువుతో సరదాగా నవ్వుతూ.. కొంచెం అసభ్యంగా భావించదగిన పదాన్ని ఉపయోగించడం వల్ల కొంతమంది డేవిడ్ వార్నర్ అభిమాని రాజేంద్ర ప్రసాద్ పై విమర్శలను వెల్లడించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ దీనిపై స్పందించారు. తాను అనకూడని మాట అన్నానని .. ఏదో సరదాగా అన్నాను తప్ప ఉద్దేశ్య పూర్వకగా కాదని.. డేవిడ్ వార్నర్ కు క్షమాపణలు అంటూ తెలిపారు.
వార్నర్ కి భాష తెలియక పోవడంతో రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్య అర్థం కాకపోయినా.. విషయం వార్నర్ దృష్టికి వెల్లింది. తాజాగా దీనిపై డేవిడ్ ఏమన్నాడో రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చాడు. వెంకీ కుడుముల ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్ సినిమా షూటింగ్ లో బాగా క్లోజ్ అయ్యారని పేర్కొన్నారు. ఇక షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు పంచులు పేల్చుకునే వారని తెలిపారు. నువ్వు యాక్టింగ్ రా చూసుకుందాం అని రాజేంద్ర ప్రసాద్ అంటే.. నువ్వు క్రికెట్ కి రా చూసుకుందాం అని వార్నర్ సరదాగా ఛాలెంజ్ చేసుకునే వాళ్లంట.
ఇలా దాని గురించి మాట్లాడబోయి రాజేంద్రప్రసాద్ అనుకోకుండా ఆ పదం వాడారని తెలిపారు. ఇది డేవిడ్ వార్నర్ కి చెప్తే అవునా, ఇట్స్ ఓకే అన్నారు. నీకు క్రికెట్ లో స్లెడ్జింగ్ తెలుసా? మేము స్లెడ్జింగ్ చేస్తే చెవుల్లోంచి రక్తం వస్తుంది. మా స్లెడ్జింగ్ ముందు ఇదెంత అని అన్నారని తెలిపాడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అంటేనే మ్యాచ్ లో స్లెడ్జింగ్ చేస్తారని అందరికి తెలిసిందే. ఇప్పుడు డేవిడ్ వార్నర్ సైతం మేము స్లెడ్జింగ్ ఎక్కువ చేస్తాం అని చెప్తూ రాజేంద్ర ప్రసాద్ మాటలను లైట్ అని చెప్పడం గమనార్హం. అసలు విషయం తెలియక కొంతమంది సోషల్ మీడియాలో రాజేంద్రప్రసాద్ పై విమర్శలు చేస్తూ హడావిడి చేసినవాళ్లు ఈ విషయం తెలిసి సైలెంట్ అయిపోయారు.