ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్(IPL 2025)లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు వర్షం కురిసింది. గత 5 మ్యాచ్ ల్లో 6 జట్లు అలవోకగా 200 పైగా పరుగులు చేశాయి. దీంతో బ్యాటర్లు బౌలర్లపై ఏవిధంగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బౌలర్లందరూ విఫలమయ్యారు. వరల్డ్ క్లాస్ బౌలర్లు అయిన కాగిసో రబడా, రషీద్ ఖాన్, చాహల్, అర్షదీప్ సింగ్, సిరాజ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
ఈ నేపథ్యంలో బ్యాటర్లకు అనుకూలంగా తయారుచేస్తున్న పిచ్, రూల్స్‌పై సౌతాఫ్రికా స్టార్ బౌలర్ రబడా(Kagiso Rabada) ఆందోళన వ్యక్తం చేశాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ బంతికి, బ్యాట్ కు మధ్య సమతుల్యత ఉండాలని సూచించాడు. ఆటగాళ్లకు వినోదాన్ని పంచడానికి ప్రతి మ్యాచ్ లో ఫ్లాట్ వికెట్ తయారు చేయకూడదన్నారు. మనం ఆడే ఆటకు క్రికెట్ బదులు బ్యాటింగ్ అనే పేరు పెట్టవచ్చని హితవు పలికారు. హై స్కోరింగ్ మ్యాచ్ లు బాగుంటాయని కానీ లో స్కోరింగ్ మ్యాచ్‌లు కూడా మంచి ఆనందాన్ని అందిస్తాయన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల వేసిన రబడా 42 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.