Tuesday, April 1, 2025
Homeటెక్ ప్లస్Airtel IPTV: ఎయిర్‌టెల్‌ IPTV సేవలు ప్రారంభం.. ప్లాన్ల వివరాలు ఇవే

Airtel IPTV: ఎయిర్‌టెల్‌ IPTV సేవలు ప్రారంభం.. ప్లాన్ల వివరాలు ఇవే

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ఐపీటీవీ(Airtel IPTV) సేవలు ప్రారంభించింది. ఈ సేవలు దేశవ్యాప్తంగా రెండు వేల నగరాలకు విస్తరించినట్లు వెల్లడించింది. వినియోగదారులకు బిగ్‌ స్క్రీన్‌లో మెరుగైన వీక్షణ అనుభూతిని అందించేందుకు ఈ సేవలను వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -

ఇందులో భాగంగా వైఫై సర్వీసులతో పాటు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, యాపిల్‌ టీవీ+, సోనీలివ్‌, జీ5 వంటి ఓటీటీ యాప్స్‌తో పాటు 600 టెలివిజన్‌ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌లో కనెక్షన్‌ బుక్‌ చేసిన వారికి ప్రారంభ ఆఫర్‌ కింద 30 రోజుల పాటు ఉచితంగా సర్వీసులు అందించనున్నట్లు చెప్పుకొచ్చింది. 40 Mbps నుంచి 1 Gbps దాకా నెట్ స్పీడ్ అందుబాటులో ఉంటుంది.

ఐపీటీవీ అంటే ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ టెలివిజన్‌. ఇంటర్నెట్‌ ద్వారా టీవీ ఛానెళ్లను ప్రసారం చేస్తారు. కేబుల్‌ టీవీ, డీటీహెచ్‌లకు ప్రత్యామ్నాయంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైఫై, ఓటీటీ, టీవీ ఛానెళ్లను కలిపి సేవలు అందిస్తాయి.

ప్లాన్ల వివరాలు..

రూ.699- 40 Mbps, 26 స్ట్రీమింగ్‌ యాప్స్‌, 350 టీవీ ఛానెళ్లు
రూ.899- 100 Mbps, 26 స్ట్రీమింగ్‌ యాప్స్‌, 350 టీవీ ఛానెళ్లు
రూ.1099- 200 Mbps, 28 స్ట్రీమింగ్‌ యాప్స్‌ 350 టీవీ ఛానెళ్లు
రూ.1599- 300 Mbps, 29 స్ట్రీమింగ్‌ యాప్స్‌ 350 టీవీ ఛానెళ్లు
రూ.3999- 1 Gbps, 29 స్ట్రీమింగ్‌ యాప్స్‌ 350 టీవీ ఛానెళ్లు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News