Wednesday, April 2, 2025
HomeఆటIPL 2025: కోల్‌కతా నైట్ రైడర్స్ బోణీ.. రాజస్తాన్ పై 8 వికెట్ల తేడాతో ఘన...

IPL 2025: కోల్‌కతా నైట్ రైడర్స్ బోణీ.. రాజస్తాన్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం..!

ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాజస్తాన్ రాయల్స్ (RR) పై ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో KKR 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ సీజన్ ఆరంభ పోరులో ఆర్సీబీ చేతిలో ఓడిన KKR, ఈసారి అన్ని విభాగాల్లో మెరుగు ప్రదర్శనతో 152 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో ఛేదించి విజయం సాధించింది. క్వింటన్ డికాక్ 61 బంతుల్లో 97 నాటౌట్ (8 ఫోర్లు, 6 సిక్సర్లు)తో అద్భుతంగా రాణించాడు. రఘువంశి 17 బంతుల్లో 22 నాటౌట్ (2 ఫోర్లు) తో సహకరించాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

- Advertisement -

కష్టమైన పిచ్ పై 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన KKR కు డికాక్ శుభారంభం అందించాడు. మొయిన్ అలీ (5) తక్కువ స్కోరుకే అవుటైనా, డికాక్ బాగా ఆడాడు. మొదటి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆపై అలీ రనౌట్ అయ్యాడు. రహానే (18)తో కలిసి డికాక్ KKRను లక్ష్యం వైపు నడిపించాడు. రహానే అవుటైన తర్వాత, రఘువంశితో కలిసి డికాక్ KKRను గెలిపించాడు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 28 బంతుల్లో 33 పరుగులతో (5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (29), రియాన్ పరాగ్ (25) రాణించారు. KKR బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణాకు తలా 2 వికెట్లు లభించాయి.

సంజూ శామ్సన్ (13) వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్, జైస్వాల్, పరాగ్ లు కాసేపు నిలిచినా.. స్పిన్నర్ల రాకతో పెవిలియన్ చేరారు. ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం చేశాడు. పిచ్ స్లోగా ఉండటంతో బంతి బ్యాట్ మీదకు సరిగా రాలేదు.. దీంతో RR 151 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ మ్యాచ్‌లో ప్రభావం చూపని వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News