Wednesday, April 2, 2025
HomeతెలంగాణKTR: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మకు కేటీఆర్ ధన్యవాదాలు

KTR: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మకు కేటీఆర్ ధన్యవాదాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీపై రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సగం రుణమాఫీతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కొందరికే రుణమాఫీ చేసి అందరికీ చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. దీంతో బ్యాంకులు రుణమాఫీ కాకపోయినా వన్‌ టైమ్ సెటిల్మెంట్‌ కింద రుణాలను రద్దు చేస్తున్నాయని.. అనంతరం కొత్త రుణాలు తీసుకునేందుకు రైతులు అర్హత కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఆమె వెల్లడించారు.

- Advertisement -

తాజాగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ రైతుల దీన స్థితిని ఎత్తిచూపిన నిర్మలమ్మకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 30 శాతం మంది రైతుల రుణాలు మాఫీ కాలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీటి సంక్షోభం ఉందని.. దశాబ్దం తరువాత తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం సీఎంకు వ్యక్తిగత సిబ్బందిలా పని చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటూ రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News