టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్(Meher Ramesh) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి హైదరాబాద్‌లో కన్నుమూశారు. సత్యవతి మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.
- Advertisement -
“దర్శకులు శ్రీ మోహర్ రమేశ్ గారి సోదరి శ్రీమతి మాదాసు సత్యవతి గారు హైదరాబాద్‌లో కన్నుమూశారనే వార్త తెలిసి చింతించాను. వారి కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లి సరదాగా గడిపేవాళ్లం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” తెలిపారు.