Tuesday, April 1, 2025
Homeచిత్ర ప్రభPrabhas: ప్రభాస్‌ పెళ్లి వార్తలపై స్పందించిన టీమ్‌

Prabhas: ప్రభాస్‌ పెళ్లి వార్తలపై స్పందించిన టీమ్‌

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున డార్లింగ్ ప్రభాస్(Prabhas) గుర్తుకువస్తారు. కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫలానా హీరోయిన్‌తో పెళ్లి ఫిక్స్ అయిందని.. అమెరికా సంబంధం అని.. విజయవాడ అమ్మాయి అని.. గోదావరి రాజుల ఫ్యామిలీ అని.. ఇలా ఎన్నో రూమర్స్ వచ్చాయి. ప్రతిసారి ఈ వార్తలను ఆయన టీమ్ ఖండిస్తూనే ఉంది. ఆరడుగుల అందగాడు , అమ్మాయిల కలల రాజు అయిన ప్రభాస్‌ను పెళ్లి చేసుకునేందుకు ఎంతో మంది రెడీగా ఉన్నారు. కానీ డార్లింగ్ మాత్రం ముందుకు రావడం లేదు.

- Advertisement -

తాజాగా ప్రభాస్‌ పెళ్లిపై సోషల్ మీడియాలో విపరతీమైన ప్రచారం జరుగుతోంది. ఈసారి కచ్చితంగా ప్రభాస్ పెళ్లి జరుగుతుందని పోస్టులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్‌ వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని కథనాలు వెలువడ్డాయి. ఏపీకి చెందిన వీరి ఫ్యామిలీ హైదరాబాద్‌లో సెటిల్ అయిందంట. రీసెంట్‌గా అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్‌ ప్రభాస్ పెళ్లి గురించి ఓ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలోని గణపవరానికి చెందిన ఓ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి ఉంటుందని చెప్పాడు. దీంతో ఈవార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా ఈ ప్రచారంపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ఇందులో ఎలాంటి నిజం లేదని.. అసత్య ప్రచారాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News