Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: అకాల వర్షాలపై జగన్ సమీక్ష

AP: అకాల వర్షాలపై జగన్ సమీక్ష

అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతాంగాన్ని ఫ్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని .. వారం రోజుల్లోగా పంట నష్టం అంచనా వేయాల్సిందిగా ఇప్పటికే సీఎం ఆదేశించారు. ప్రాధమిక సమాచారం మేరకు 5జిల్లాల్లోని 25 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు, పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకుంటామని సర్కారు వెల్లడించింది. ఈమేరకు మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ప్రకటన చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారని ..పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందించడం తోపాటు పంటల బీమా కూడా కల్పిస్తామన్నారు. బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి పంటల బీమాను కల్పిస్తుందని మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. రైతులు విత్తనం మొదలు పంటలు పండించి వాటిని అమ్ముకునే వరకు వారికి తగిన తోడ్పాటును అందించేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వేణుగోపాల కృష్ణ చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News