Wednesday, April 2, 2025
HomeదైవంUgadi: ఉగాది నాడు ఈ పనులు అస్సలు చేయకూడదంట.. ఎందుకంటే..!

Ugadi: ఉగాది నాడు ఈ పనులు అస్సలు చేయకూడదంట.. ఎందుకంటే..!

హిందూ ధర్మంలో ప్రతి పండుగకూ విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి పండుగల్లో ఉగాది ఒకటి. ఆలోచన పరంగా, సాంస్కృతికంగా, భక్తిపరంగా ఎంతో ప్రత్యేకమైన ఉగాది పండుగ. ఇది తెలుగు సంవత్సరాది శుభారంభాన్ని సూచిస్తుంది. తెలుగు ప్రజలు ఉగాదిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజున ఇది వస్తుంది. పురాణాల ప్రకారం, ఈ రోజున కృత యుగం ప్రారంభమైనట్లు చెబుతారు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కూడా ఉగాది పండుగను ఘనంగా నిర్వహిస్తారు.

- Advertisement -

ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 30, 2025, ఆదివారం నాడు జరుపుకోనున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరారంభాన్ని తెలుగువారు ఆనందంగా స్వాగతించనున్నారు. ఉగాది రోజున మంచి పనులు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే కొన్ని పనులు చేయకూడదని కూడా చెబుతారు. ఈ కథనంలో ఉగాది రోజు ఎలాంటి పనులు చేస్తే శుభం కలుగుతుంది.. ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో తెలుసుకుందాం.

ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులు:
* ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి: సాధారణంగా ఏ పండుగ అయియినా.. ముందురోజు ఇంటిని శుభ్రం చేసి వేప, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించాలి. ఇది ఇంటికి శుభాన్ని కలిగిస్తుందని పెద్దలు చెబుతుంటారు.

* బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి: ఉగాది నాడు ఉదయాన్నే అంటే సూర్యుడు ఉదయించడానికి పూర్వమే లేచి.. నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేసి, కొత్త బట్టలు ధరించడం మంగళకరం.

* దేవుని పూజించడం: హిందూ ధర్మంలో పండుగల రోజు దేవతా మూర్తులను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. ఇక ఉగాది నాడు కూడా లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తే.. డబ్బుకు లోటుండదని నమ్ముతారు. అనంతరం ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి.

* శుభ సమయాల్లో కొత్త వస్తువులు కొనడ: ఉగాది నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల మధ్య బంగారం, వెండి, పసుపు, బెల్లం మొదలైన శుభకర వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టకరమని పండితులు చెబుతున్నారు.

ఉగాది రోజున చేయకూడని పనులు:

* గొడవలు, వాగ్వాదాలు వద్దు: ఉగాది నాడు ఎంతో పవిత్రమైనదిగా చెబుతారు. ఈ రోజున మనుషులతో తర్కాలు, గొడవలు చేయకూడదు. దాంతో ఆ సంవత్సరమంతా అలాంటి సమస్యలు ఎదురవుతాయని నమ్మకం.

* అప్పులు ఇవ్వడం, తీసుకోవడం వద్దు: సంవత్సరం ప్రారంభమైన ఈ రోజు అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఆర్థిక నష్టానికి దారితీస్తుందని పండితులు అంటుంటారు.

* చినిగిన దుస్తులు ధరించడం: ఉగాది నాడు కొత్త బట్టలు ధరించడం మంచి శుభసూచకంగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున చిరిగిన దుస్తులు దరించడం దరిద్రాన్ని సూచిస్తుండంట.

* తామసిక ఆహారం తీసుకోవద్దు: ఉగాది నాడు మాంసాహారం, మద్యం సేవించడం, అధర్మక చర్యలకు పాల్పడడం మంచిది కాదని పండితులు అంటుంటారు.

* జుట్టు లేదా గోళ్లు కత్తిరించుకోవడం: ఉగాది నాడు కొన్ని పనులు చేయడం మంచిది కాదు. ఇది ఇంటికి శుభాన్ని కలిగించదు. గోళ్లు, జుట్టు కత్తించుకోవడం శుభతకు విరుద్ధంగా భావిస్తారు.

ఉగాది పండగ ప్రత్యేకత: ఈ రోజున మనం చేసిన ప్రతి చిన్న మంచి పని, ఆలోచన, శుభకార్యం మన జీవితానికి మేలుగా మారుతుందని పెద్దలు చెబుతారు. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, కుటుంబ సమేతంగా ఉగాదిని జరుపుకోవడం సంతోషాన్ని కలిగిస్తుంది. కొత్త సంవత్సరానికి శుభారంభం పెట్టే ఈ ఉత్సవాన్ని, మన సంప్రదాయాలను పాటిస్తూ జరుపుకుందాం. (గమనిక: ఈ కథనం మత విశ్వాసాల ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News