
రుహానీ శర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2013లో మోడలింగ్ కెరీర్ ప్రారంభించిన రుహానీ శర్మ, తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఈ నటి 2013లో పంజాబీ మ్యూజిక్ వీడియో ‘పూడి తూ పటాకా’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక 2017లో తమిళ సినిమా ‘కడైసి బెంచ్ కార్తీ’ ద్వారా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇక 2018లో ‘చి.లా.సౌ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తన సహజమైన నటనతో మంచి గుర్తింపు పొందింది.

ఇక 2020లో విడుదలైన ‘హిట్’ సినిమాలో నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది.

‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, హర్, ‘సైంధవ్, ‘ఆపరేషన్ వాలెంటైన్ వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. ఇటీవల ‘శ్రీరంగనీతులు’ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక పెప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రుహానీ శర్మ.. తన ఫోటోలను అపల్ లోడ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా పింక్ కలర్ ఫ్రాక్‌లో ఉన్న తన ఫోటోలతో వైరల్ అయింది. వీటిని చూస్తూ కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.