ఈ నెల 30న విశాఖపట్నం నందు జరుగనున్న ఢిల్లీ క్యాపిటల్స్ VS సన్ రైజేర్స్ హైదరాబాద్ IPL T-20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ప్రజల సౌకర్యం కోసం విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసులు పలు రూట్లను( Routes diverted)దారి మళ్లించారు..
మధురవాడ క్రికెట్ స్టేడియం:
మధురవాడ క్రికెట్ స్టేడియానికి 28 వేల మంది వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి వాహనాలు కూడా వేల సంఖ్యలో ఉంటాయి. మ్యాచ్ తో సంబంధంలేని వాహనదారులు మధురవాడ క్రికెట్ స్టేడియం వైపు ప్రయాణించకుండా ఈ క్రింది మార్గాలలో ప్రయాణించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళం వైపు నుంచి వచ్చే వాహనదారులకు సూచనలు:
శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుండి వచ్చే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు సొంట్యం, పెందుర్తి, ఎన్.ఎ.డి., టి.సి. పాలెం మీదుగా నగములోనికి వెళ్ళవలెను. అలాగే RTC కాంప్లెక్స్ నుండి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు బస్సులు టి.న్. పాలెం, ఎన్.ఎ.డి., పెందుర్తి, సొంట్యాం మీదుగా ప్రయాణించి వెళ్ళవలెను.
చిన్న వాహనములు
విజయనగరం, శ్రీకాకుళంల నుంచి వచ్చు ఇతర చిన్న వాహనములు మారికవలస వద్ద ఎడమవైపు తిరిగి జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం చేరి కుడివైపు తిరిగి బీచ్ రోడ్డు గుండా ప్రయాణించీ ఋషికొండ, సాగర్ నగర్, జోడిగుడ్లపాలెం మీదుగా పోవాల్సి ఉంటుంది.
కారులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు
శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుండి వచ్చే కారులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మొదలైనవి కార్ షెడ్ ముందు గల PEPSI cutting గుండా మిధులాపురి కాలనీ మీదుగా MVV సిటీ వెనుకగా వెళ్లి లా కాలేజీ రోడ్డు మీదగా NH-16 చేరుకుని నగరంలోకి వెళ్ళవలెను. అలాగే లా కాలేజ్ రోడ్డు నుండి పనోరము హీల్స్ మీదుగా ఋషికొండ మీదుగా నగరంలోకి వెళ్ళవలెను.
విశాఖపట్నం నగరం నుండి వచ్చు వాహనదారులకు సూచనలు:
విశాఖపట్నం నగరంలో నుండి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు బస్సులు ఇతర కమర్షియల్ వాహనములు హనుమంతవాక వద్ద ఎడమవైపు తిరిగి ఆరిలోన BRTS రోడ్డులో వెళ్లి అడవివరం వద్ద కుడివైపు తిరిగి నీలకుండీలు జంక్షన్ మీదుగా హైవే పైకి వెళ్లి, ఆనందపురం మీదుగా వెళ్ళాలి.
విశాఖపట్నం నగరంలో నుండి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మొదలైనవి హనుమంతవాక జంక్షన్ నుండి ఎడమవైపు తిరిగి ఆడవివరం మీదుగా ఆనందపురం వెళ్ళవచ్చు లేదా హనుమంతవాక జంక్షన్ లేదా విశాఖ వ్యాలీ జంక్షన్ లేదా ఎండాడ జంక్షన్ వద్ద కుడివైపు తిరిగి బీచ్ రోడ్ గుండా తిమ్మాపురం వద్ద ఎడమవైపు తిరిగి మారికవలస వద్ద NH-16 చేరుకోవచ్చును. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరారు.