బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటించిన ‘క్రిష్’ సిరీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ సిరీస్ సినిమాలను తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో మూడు చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా నాలుగో భాగానికి స్పందించిన అధికారిక ప్రకటన వచ్చింది. ‘క్రిష్ 4′(Krrish 4) చిత్రానికి హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనుండటం విశేషం. ఈ విషయాన్ని హృతిక్ తండ్రి, సీనియర్ దర్శకుడు రాకేశ్ రోషన్ తెలిపారు.
’25 ఏళ్ల కిత్రం నిన్ను యాక్టర్‌గా ఇండిస్టీకి పరిచయం చేశాను. ఇప్పుడు మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఆదిత్యచోప్రా, నేను కలిసి నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. దర్శకుడిగానూ నువ్వు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకమైన ‘క్రిష్ 4’కు నువ్వు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది .’అని రాకేశ్ రోషన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని రాకేష్ రోషన్, ఆదిత్య చోప్రాలు నిర్మిస్తున్నారు. క్రిష్ సిరీస్‌లో రూపుదిద్దుకున్న మూడు చిత్రాలకు రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.