గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి(Vallabhaneni Vamsi) భారీ షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ ఆఫీసులో డీటీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సత్యవర్ధన్‌కు ప్రాణహాని ఉందని బాధితుడి తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ఇప్పటికే వంశీని రిమాండ్‌కు తీసుకున్నందున బెయిల్ మంజూరు చేయాలని అతడి తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ విజయవాడ సీఐడీ కోర్టు వంశీ బెయిల్ పిటిషన్‌ను గురువారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా కాగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్న వంశీని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుతో పాటు మరిన్ని కూడా ఆయనపై నమోదు అయ్యాయి. దాదాపు 40 రోజులుగా వంశీ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.