కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి జియో చైర్మన్ ఆకాష్ అంబానీ( Jio Chairman Akash Ambani) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో ఆకాశ్ అంబానీకి వేద పండితులు వేదశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకున్నారు. మెల్ వస్త్రం, పచ్చ కట్టులో శ్రీవారి దర్శించుకున్నారు ఆకాశ్ అంబానీ.
శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలోని గోశాలకు చేరుకున్నారు. గోశాలలో గో మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర గోమాతకు దాణా సమర్పణ చేశారు. గజ రాజుల వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు ఆకాశ్ అంబానీ.