ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా జనసేన పార్టీ నేత నాగబాబు(Nagababu) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మండలి చైర్మన్ మోషేన్ రాజు నాగబాబు చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
ఆ తర్వాత తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని(Chiranjeevi) హైదరాబాద్‌లో కలిశారు. ఈ విషయాన్ని చిరు ఎక్స్ వేదికగా చెబుతూ నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. “ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడి (MLC) గా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి అన్నయ్య, వదిన ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాము” అని రాసుకొచ్చారు.

ఇవాళ ఉదయం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో నాగబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినందుకు పవన్ కల్యాణ్ నాగబాబుకి శుభాకాంక్షలు చెప్పారు.

