హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల(HCU Lands) వ్యవహారం తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. వేలం వేయాలనుకుంటున్న 400 ఎకరాల భూమిలో 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించకూడదని సూచించారు. 400 ఎకరాలకు సంబంధించి అధికారులతో ఎలాంటి సర్వే నిర్వహించలేదని.. అలాంటప్పుడు సరిహద్దులను ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు(TGIIC) ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలాన్ని కేటాయించాలని కోరారు.