రాహుల్ గాంధీ కర్నాటక ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. బెళగాం నుంచి రాహుల్ యువ క్రాంతి ర్యాలీ ప్రారంభం కానుంది. భారత్ జోడో యాత్ర తరువాత మొదటిసారి కర్నాటక వస్తున్నారు రాహుల్, దీంతో ఈయన కార్యక్రమం కోసం భారీ సన్నాహకాలు చేస్తోంది పార్టీ. బెళగావి జిల్లాలో జరుగనున్న భారీ బహిరంగ సభలోనూ రాహుల్ ప్రసంగించనున్నారు.
ఫైవ్ గ్యారెంటీస్ లో..
తాము అధికారంలోకి వస్తే ఐదు అంశాలను నెరవేరుస్తామంటూ ప్రామిస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నాలుగవ ఎన్నికల వాగ్దానాన్ని రాహుల్ ప్రకటించనున్నారు. ఇంటికి ఉచిత విద్యుత్, గృహిణులకు నెలుకు 2,000 రూపాయలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి 10 కేజీలు ఉచిత బియ్యం పథకాలను పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే రాహుల్ చేయబోతున్న నాలుగవ వాగ్దానం యువతకు సంబంధించినది అని తెలుస్తోంది.
బెళ్గాం పర్యటన అనంతరం ఆయన టుంకూరు వెళ్లనున్నారు. టుంకూరులోనూ ఎన్నికల సభలో ఆయన పాల్గొంటారు. మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 224 సీట్లున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.