Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభPoonam Kaur: సరికొత్త అవతారంలో పూనమ్ కౌర్.. గవర్నర్ అభినందనలు

Poonam Kaur: సరికొత్త అవతారంలో పూనమ్ కౌర్.. గవర్నర్ అభినందనలు

తెలుగులో పలు సినిమాలలో నటించిన పూనమ్ కౌర్(Poonam Kaur) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆమె తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా డిజిటల్ వేదికగానూ ఓ వినూత్న కార్యక్రమంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘శక్తి ఔర్ సంస్కృతి’(Shakti Aur Sanskriti) పేరుతో ప్రసారం కానున్న కార్యక్రమానికి పూనమ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. స్త్రీ శక్తిని, భారతదేశ సంస్కృతిని గౌరవిస్తూ.. ఈ తరంలో స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

- Advertisement -

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ‘శక్తి ఔర్ సంస్కృతి’ లోగో ఆవిష్కరణ రాజ్‌భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సాధికారత కల్పించడం, సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు. ‘శక్తి ఔర్ సంస్కృతి’ లాంటి గొప్ప కార్యక్రమానికి పూనమ్ కౌర్ శ్రీకారం చుట్టడం పట్ల అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News