తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద గట్టు వామనరావు దంపతులు(Vamanarao Murder Case) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరపాలన్న వామనరావు కుమారుడు గట్టు కిషన్ రావు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కేసుకు సంబంధించి రికార్డు వీడియోలులతో సహా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ పత్రాలు తమ ముందు ఉంచాలని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందాల్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
- Advertisement -
ఆ రికార్డులను పరిశీలించిన తర్వాత సీబీఐ విచారణ జరపాలా లేదా అన్న విషయాన్ని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. మూడు వారాల్లో రికార్డులు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.