Sunday, April 6, 2025
HomeదైవంPawan: నేడు భద్రాచలం రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

Pawan: నేడు భద్రాచలం రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఈ రోజు భద్రాచలం వెళ్ళనున్నారు. రేపు భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఒక్క రోజు ముందుగానే ఖమ్మం జిల్లాకు రానున్నారు.

- Advertisement -

ఇక, భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను డిప్యూటీ సీఎం ఇవ్వనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి.. సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్.

ఇక, రేపు ఏప్రిల్ 6న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం లో పాల్గొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్పిస్తారు. అలాగే, రేపు సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరిగి హైదరాబాద్ లోని తన నివాసానికి ఆయన చేరుకోనున్నారు.

దీంతో పాటు రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు భద్రాచలం వస్తుండటంతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News