గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది'(Peddi) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, ఫస్ట్ లుక్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ షాట్ పేరుతో గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ గ్లింప్స్ వీడియో గురించి చరణ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఓ శాంపిల్ మ్యూజిక్ బిట్ పంచుకున్నారు. ‘పెద్ది పెద్ది’ అంటూ సాగే ఈ బిట్ కిర్రాక్ పుట్టించేలా ఉంది.
“పెద్ది గ్లింప్స్ చూశాక అమితమైన సంతోషం కలిగింది. ఏఆర్ రెహమాన్ సర్ ఈ సినిమాకు అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మామూలుగా లేదు.. ఆదిరిపోయేలా ఉంది. ఈ గ్లింప్స్ మీరు తప్పకుండా ఇష్టపడతారు. రేపు ఉదయం 11.45 గంటలకు ఫస్ట్ షాట్ వస్తోంది” అంటూ రాసుకొచ్చారు. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.