నేచురల్ స్టార్ నాని సమర్పణలో ‘కోర్ట్’(Court) మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, తదితరులు కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మార్చి 14న విడుదలై మంచి పేరు దక్కించుకుంది. ఇందులో శివాజీ నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి.
తన బంధువుల అమ్మాయిని ప్రేమించిన ఓ యువకుడిని అక్రమంగా అరెస్ట్ చేయించి బయటికి రాకుండా శివాజీ ఎలా ప్లాన్ వేశాడనే స్టోరీ లైన్‌తో ఈ మూవీని రూపొందించారు. అయితే ఆ యువకుడికి శిక్ష పడకుండా న్యాయవాది పాత్రధారి ప్రియదర్శి ఎలాంటి న్యాయపోరాటం చేశాడనే కోణంలో సినిమా ఆసక్తికరంగా ఉంది. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.