అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా కెనాల్ పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ (50) మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో బాధితులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. మృతురాలు డిప్యూటీ కలెక్టర్ రమ స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ మృతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES