తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) కథానాయకుడిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly Telugu Trailer). సీనియర్ నటి త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రభు, దాస్, సిమ్రాన్ తదితరులుకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
- Advertisement -
‘నాకోసం దమ్ము వదిలేశాను.. నా భార్య కోసం మందు వదిలేశాను.. నా కొడుకు కోసం వయెలెన్స్ వదిలేశాను’.. ‘వాడు భయాన్నే భయపెడతాడు’ అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.