Monday, April 7, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: సారీ గాయ్స్.. హెల్ప్ చేయలేకపోతున్నాను: లోకేష్

Nara Lokesh: సారీ గాయ్స్.. హెల్ప్ చేయలేకపోతున్నాను: లోకేష్

పొలాల్లో మందు కొడుతూ రిలాక్స్ అవుతున్న కుర్రాళ్లను ఉద్దేశించి సారీ గాయ్స్ హెల్ప్ చేయలేకపోతున్నాను అంటూ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ట్వీట్ చేశారు. బహిరంగ ప్రాంతాల్లో అసాంఘిక చర్యలను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా పోలీసులు గుడివాడ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ వెనుక వైపు పొలాల్లో యువత మద్యం సేవిస్తున్నారని గుర్తించారు. దీంతో మద్యం తాగుతున్న ఇద్దరు యువకులను డ్రోన్ ద్వారా గుర్తించారు. డ్రోన్ చూసిన ఇద్దరు పారిపోయారు. ఈ వీడియోను కృష్ణ జిల్లా పోలీసులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేయగా.. లోకేష్ సరదగా స్పందించారు. సారీ గాయ్స్‌. పోలీసులు డ్రోన్ల ద్వారా వారి డ్యూటీ చేశారంటూ కామెంట్ చేశారు.

- Advertisement -

ఇటీవల ఓ లారీలో కూర్చుని పేకాడుతున్న జూదగాళ్లను డ్రోన్ సహాయంతో గుర్తించిన వీడియోను హోంమంత్రి అనిత పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News