ఏప్రిల్ 11 వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandra Babu) ఒంటిమిట్ట(Ontimitta)లో శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం జరుగుతుందని సోమవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 11వ తేదీ ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు.
కళ్యాణానికి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడం జరుగుతుందని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పర్యటనను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీఎం పర్యటనలో ఎటువంటి చిన్న సమస్య కూడా తలెత్తకుండా టీటీడీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.