గత కొద్ది రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పెరుగుదల సామాన్యుల గుండెల్లో భయాన్ని నింపింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, బంగారం కొనాలా వద్దా అనే అయోమయంలో ప్రజలు ఉన్నారు. అయితే, తాజా వార్తల ప్రకారం, బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఈరోజు, ఏప్రిల్ 8న హైదరాబాద్, విజయవాడలలో 24, 22 క్యారెట్ల బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
గత కొన్ని రోజులుగా నిరంతరంగా పెరుగుతున్న బంగారం ధరలు, ఏప్రిల్ మొదటి వారంలో మరింత ఎక్కువగా పెరిగాయి. నిన్న, ఏప్రిల్ 7న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 90380గా నమోదైంది. అయితే, ఈ రోజు ఆ ధర రూ. 89730 కి తగ్గింది. అంటే ఒక్క రోజే రూ. 650 మేర తగ్గుదల కనిపించింది.
ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. నిన్న రూ. 82850గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజు రూ.82250 కి చేరుకుంది. ఇక్కడ రూ.600 మేర తగ్గుదల నమోదైంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 67300 కి తగ్గింది. ఇదిలా ఉండగా, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో, కొంతమంది బంగారం కొనకుండా ఉండలేకపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ, బంగారం ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల, బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చినట్టయింది. రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.