Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభఅఖండ 2లో ఆ సీన్ వేరే లెవెల్ అంట.. దబిడి దిబిడే..!

అఖండ 2లో ఆ సీన్ వేరే లెవెల్ అంట.. దబిడి దిబిడే..!

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ “అఖండ 2” ప్రస్తుతం హైప్ క్రియేట్ చేస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన “అఖండ” బ్లాక్ బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో, ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

పాన్‌ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్ మరియు విజువల్ పరంగా ఎలాంటి రాజీపడకుండా తెరకెక్కిస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో షూటింగ్ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చిత్ర బృందం ఒక పవర్‌ఫుల్ ఇంటర్వెల్ సీన్‌ను షూట్ చేస్తోందంట.. గతంలో “అఖండ”లో ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకుల్లో రక్తం ఉరకలెత్తేలా చేసిన తీరు తెలిసిందే. ఈసారి దాన్ని మించి మాస్, ఆధ్యాత్మికతతో మేళవించిన సన్నివేశాన్ని డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్.

ఇక బాలయ్య కెరీర్ విషయంలో ఇటీవల విడుదలైన నాలుగు సినిమాలూ హిట్స్‌గా నిలిచాయి… ఈ నేపథ్యంలో “అఖండ 2″పై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. డివోషనల్ టోన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలవనున్నాయి. సంగీత దర్శకుడు థమన్ మరోసారి తన మ్యూజిక్‌తో సినిమాలో జోష్ పెంచనున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరి ఈ సారి అఖండ థియేటర్లలో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News