ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ఆటగాడిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. సోమవారం రాత్రి వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో టీ20ల్లో 5000 పరుగులు, 200 వికెట్లు పడగొట్టిన తొలి భారత ఆటగాడిగా హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. పాండ్యా కంటే ముందు డ్వేన్ బ్రావో, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, మహ్మద్ నబీ, సమిత్ పటేల్, కీరాన్ పొలార్డ్, రవి బొపారా, డేనియల్ క్రిస్టియన్, మొయిన్ అలీ, షేన్ వాట్సన్, మహ్మద్ హఫీజ్ ఈ ఘనత సాధించారు.
టీ20ల్లో 5000 పరుగులు, 200 వికెట్లు సాధించిన ఆటగాళ్లు..
డ్వేన్ బ్రావో – 6970 పరుగులు, 631 వికెట్లు
షకీబ్ అల్ హసన్ – 7438 పరుగులు, 492 వికెట్లు
ఆండ్రీ రస్సెల్ – 9018 పరుగులు, 470 వికెట్లు
మహ్మద్ నబీ – 6135 పరుగులు, 369 వికెట్లు
సమిత్ పటేల్ – 6673 పరుగులు, 352 వికెట్లు
కీరన్ పొలార్డ్ – 13537 పరుగులు, 326 వికెట్లు
రవి బొపారా – 9486 పరుగులు, 291 వికెట్లు
డేనియల్ క్రిస్టియన్ – 5848 పరుగులు, 281 వికెట్లు
మొయిన్ అలీ – 7140 పరుగులు, 375 వికెట్లు
షేన్ వాట్సన్ – 8821 పరుగులు, 343 వికెట్లు
మహ్మద్ హఫీజ్ – 7946 పరుగులు, 202 వికెట్లు
హార్దిక్ పాండ్యా – 5390 పరుగులు, 200 వికెట్లు