సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘అగ్రిప్రమాద ఘటన వార్త విని షాక్‌కు గురయ్యా. పవన్ అన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి. క్లిష్ట సమయంలో పవన్ కుటుంబం ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని తెలిపారు.
- Advertisement -
కాగా సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక అల్లూరి సీతారామరాజు పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఈ విషయం తెలుసుకుని కాసేపట్లో సింగపూర్ వెళ్లనున్నారు.