వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్(YS Jagan) రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు.. ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్ హెలికాఫ్టర్(Helicopter)డ్యామేజ్ అయింది. అయితే భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు జగన్ హెలికాప్టర్ దిగగానే దూసుకుపోయారు. దీంతో స్వల్పంగా హెలికాప్టర్ దెబ్బతింది. బెంగళూరుకు అదే హెలికాప్టర్‌లో వెళ్లడం ప్రమాదమని సిబ్బంది జగన్‌కు సూచించడంతో రోడ్డు మార్గాన బయల్దేరి వెళ్లారు.
- Advertisement -
హెలిప్యాడ్ దగ్గర సరైన సెక్యూరిటీ లేకపోవడంతో.. కార్యకర్తలు ఒక్కసారిగా హెలికాప్టర్ మీదకు తోసుకురావడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న జగన్‌కు తగినంత భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు.