శ్రీలంక వేదికగా జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత మహిళా జట్టును(Team India) ప్రకటించింది. ఈ వన్డే సిరీస్ ఏప్రిల్ 27న ప్రారంభంకానుంది. భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో ఆడనుంది. మూడు జట్లు ఒక్కొక్కటి నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అన్ని మ్యాచులు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే జరుగన్నాయి.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (WK), యస్తికా భాటియా(WK), దీప్తి కౌర్, అమన్‌జోత్ కౌర్, కాశ్వి గౌతమ్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్ హసాబినీస్, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ.
ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ ఇదే:
మొదటి వన్డే: శ్రీలంక vs భారత్, ఏప్రిల్ 27
రెండో వన్డే: భారతదేశం vs దక్షిణాఫ్రికా, ఏప్రిల్ 29
మూడో వన్డే: శ్రీలంక vs దక్షిణాఫ్రికా, మే 02
నాలుగో వన్డే: శ్రీలంక vs భారత్, మే 04
ఐదో వన్డే: దక్షిణాఫ్రికా vs భారత్, మే 07
ఆరో వన్డే: శ్రీలంక vs దక్షిణాఫ్రికా, మే 09
ఫైనల్: మే 11