మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannah) అఘోరీగా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓదెల 2′(Odela 2). ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించగా.. డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఇక ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధు క్రియేషన్స్ బ్యానర్ పై మధు నిర్మాణంలో నిర్మితమవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. దుష్టశక్తుల నుంచి ఓదెల గ్రామాన్ని మల్లన్న స్వామి ఎలా రక్షించాడనేది ఈ సినిమాలో కీలకాంశం. సంభాషణలు, విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి
‘ఓదెల పార్ట్ 1’ సినిమాలో మరణించిన వ్యక్తి ప్రేతాత్మగా మారి తిరిగి వచ్చి ఆ ఊరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు.. తమన్నా అఘోరీగా శివశక్తితో ఆ ప్రేతాత్మని ఎలా ఎదుర్కొంది అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. పాన్ ఇండియా వైడ్ ఏప్రిట్ 17న సినిమాను విడుదల చేయనున్నారు.