ఎట్టకేలకు అక్కినేని అఖిల్(Akkineni Akhil) అభిమానులకు ఓ శుభవార్త అందింది. ‘ఏజెంట్’ మూవీ డిజాస్టర్ అయి రెండేళ్లు పూర్తి అయింది. అయితే ఇప్పటివరకు అఖిల్ కొత్త మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. తాజాగా ఇవాళ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. కింగ్ నాగార్జున చేతుల మీదుగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయింది.
సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ మూవీకి ‘లెనిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ గ్లింప్స్ లో.. ‘మా నాయన నాకో మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా.. పేరు ఉండదు.. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు.. పేరు మాత్రమే ఉంటది..’ అనే డైలాగ్ అదిరిపోయింది. మొత్తంగా ఈ మూవీ లవ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కనుందని తెలుస్తోంది.