ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోడీ(PM Modi) ఆరా తీశారు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్‌కు ఫోన్ చేసి పిల్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని.. ఆయనకు ధైర్యం చెప్పినట్లు సమాచారం.
కాగా సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. కాళ్లు, చేతులకు కాలిన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు విశాఖ పర్యటన ముగించుకున్న పవన్ కల్యాణ్.. సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దంపతులు సైతం సింగపూర్ బయల్దేరారు. పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు స్పందించారు.