భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ (Kedar Jadhav) రాజకీయ అరంగేట్రం చేశారు. మహారాష్ట్రకు చెందిన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు.
- Advertisement -
కేదార్ జాదవ్ భారత్ తరపున 73 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో మొత్తం 1389 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 27 వికెట్లు పడగొట్టాడు. అలాగే 9 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఐపీఎల్‌లో కూడా 95 మ్యాచ్‌లు ఆడి 1208 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున ఆడాడు.