Saturday, April 19, 2025
HomeఆటIPL 2025 : రికార్డులు రపా రపా.. ప్రియాన్ష్ ఆర్య ఊచకోత.. ఇదే బాదుడు స్వామి..!

IPL 2025 : రికార్డులు రపా రపా.. ప్రియాన్ష్ ఆర్య ఊచకోత.. ఇదే బాదుడు స్వామి..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య.. తన మెరుపు బ్యాటింగ్‌తో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై ఆర్య దాడి మరిపించేలా సాగింది. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించి సిక్సుల వర్షం కురిపించాడు. అతని ఇన్నింగ్స్ తో పంజాబ్ భారీ స్కోర్ కు పరుగులు పెట్టింది.

- Advertisement -

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు.. ఆర్య ధాటికి పవర్‌ప్లే నుంచే దూకుడుగా ఆడింది. ఆర్య 19 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసి, ఒక్కసారిగా చెలరేగిపోయాడు. చెన్నై బౌలర్లు ఏ లెంగ్త్ లో వేసినా కట్టడించలేకపోయారు. ఆర్య 9 సిక్సులు, 7 ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. చివరికి నూర్ అహ్మద్ బౌలింగ్ లో 103 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత శశాంక్ సింగ్ (52 పరుగులు – 36 బంతులు), మార్కో జాన్సన్ (34 పరుగులు – 19 బంతులు) కూడా చక్కటి మద్దతు ఇచ్చారు. వీరి అద్భుత ఆటతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఒక దశలో వికెట్లు పడినా స్కోరింగ్ వేగం మాత్రం తగ్గలేదు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు తీసి కొంత ఒత్తిడి తేవడానికి ప్రయత్నించారు. ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ చెరో వికెట్ తీసినప్పటికీ, ఆర్య దూకుడు ముందు వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News