ప్రతి పౌరుడి ఫోనులో 9552300009 నంబరు మన మిత్రపేరిట సేవ్ చేయనున్నారు. జిల్లా కలెక్టర్లకు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించనుంది. ప్రజలకు అవగాహన పెంచేలా ప్రత్యేక కరపత్రం, వీడియో సందేశం ఇవ్వనున్నారు.
ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునేలా కార్యక్రమ రూపకల్పన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ పూర్తి చేసింది. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 250కి పైగా సేవలందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
జూన్ నెలకు 500కుపైగా సేవలను అందించాలనే దిశగా చర్యలు చేపట్టింది. తదుపరి దశలో 1000కిపైగా సేవల కల్పించాలన్నదే ప్రభుత్వ అంతిమ లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా వాట్సాప్ గవర్నెన్స్‌ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అందుబాటులోకి తెచ్చారు.
ఇప్పటికే మనమిత్ర ప్రజాభిమానం అందుకుంటుంది. చదువు రాని వారు కూడా కేవలం తమ వాయిస్ మెసెజ్ ద్వారా కూడా పనిచేసేలా స్ ఏఐ ఆధారిత చాట్‌బాట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పౌరులందరూ తమ మొబైల్ ఫోనులో మనమిత్ర పేరిట 9552300009 నంబరును సేవ్ చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది.