బంగారం ధరలు గల్లంతవుతూ వస్తున్నాయంటే నమ్మగలిగే విషయం కాదు! కానీ నిజం. గత ఐదు రోజుల్లో పసిడి ధర ఏకంగా రూ.3,650 మేర తగ్గింది. ఇంత పెద్ద తగ్గుదల పసిడి ప్రేమికులకు నిజంగా గుడ్ న్యూస్.
ఏప్రిల్ 4న రూ.1,740 తగ్గింది, 5న మరో రూ.980 పడిపోయింది. 6న ధరలు స్థిరంగా ఉండగా, 7న రూ.280 తక్కువయ్యాయి. ఇక 8న రూ.650 తగ్గింది. మొత్తం కలిపితే 5 రోజుల్లోనే గోల్డ్ రేట్లు భారీగా పడిపోయాయి.
అయితే ఏప్రిల్ 9న మాత్రం స్వల్పంగా ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.90,440 (10 గ్రాములకు). అలాగే 22 క్యారెట్ల ధర రూ.82,900కు చేరింది. అయితే ఇవి బేసిక్ రేట్లు మాత్రమే – జీఎస్‌టీ, మేకింగ్ చార్జీలు అదనంగా ఉంటాయి.
హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ ధరలు వర్తిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్, డాలర్ మారకం విలువ, ప్రపంచ పరిస్థితులపై బంగారం ధరలు ఆధారపడి మారుతుండటం వల్ల, ఇప్పుడు కొనుగోలు చేయడం బెటర్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇంత మంచి తక్కువ ధరలు తిరిగి వస్తాయా అనేది అనిశ్చితం. కనుక బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లకు ఇది మంచి అవకాశం!