Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభNTR: ఎన్టీఆర్ కొత్త మూవీ అప్‌డేట్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్ కొత్త మూవీ అప్‌డేట్ వచ్చేసింది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరోగా, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ(NTRNeel) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటార‌ని ఓ పోస్టర్ విడుదల చేశారు.

- Advertisement -

కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించిన సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు తారక్‌తో ఫుల్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కే ఈ పాన్ ఇండియా చిత్రం జనవరి 9, 2026లో విడుదల కానుంది. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తగా నిర్మిస్తున్నాయి. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News