Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభManchu Manoj: అలా చేశారు కాబట్టే ఇంత దూరం వ‌చ్చింది: మ‌నోజ్‌

Manchu Manoj: అలా చేశారు కాబట్టే ఇంత దూరం వ‌చ్చింది: మ‌నోజ్‌

కొంత‌కాలంగా మంచు మోహ‌న్‌బాబు కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం మంచు మ‌నోజ్(Manchu Manoj) జ‌ల్‌ప‌ల్లిలోని నివాసం ముందు బైఠాయించి నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. త‌మ‌ది ఆస్తి గొడ‌వ కాద‌ని స్పష్టం చేశారు.

- Advertisement -

తాజాగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌ ఇంటర్వ్యూలో మనోజ్ కీలక విషయాలు తెలిపారు. “ఇల్లు, ఇత‌ర ఆస్తుల‌పై నాకు ఏమాత్రం ఇష్టం లేదు. విద్యార్థుల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌శ్నించిన సంద‌ర్భంలో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. సుమారు రెండేళ్ల నుంచి గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. వారిని ప్ర‌శ్నించాన‌నే కార‌ణంతో నా గౌర‌వానికి భంగం క‌లిగించే త‌ప్పుడు క‌థనాలు ప్ర‌చారం చేశారు. నాపై దాదాపు 30కి పైగా త‌ప్పుడు కేసులు పెట్టారు. నాన్న‌ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఆశించ‌లేదు.

ఈ గొడ‌వ‌ల్లోకి నా భార్య‌ను లాగారు. అలా చేయ‌క‌పోయి ఉంటే నేను ఇంత దూరం వ‌చ్చే వాడిని కాదు. త‌న వ‌ల్లే చెడిపోతున్నానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్‌లో నా భార్యాబిడ్డ‌ల పేర్లు చేర్చ‌డంతో నా మ‌న‌సు విరిగిపోయింది. నేను ఆస్తి అడ‌గలేదు. ఏ త‌ప్పు చేయ‌లేదు. అందుకే దేనికీ భ‌య‌ప‌డ‌ను” అని మ‌నోజ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News