నేడు ఒంటిమిట్ట(Ontimitta)లో సీత రాముల కళ్యాణం జరగనుంది. ఈ కల్యాణానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandra Babu) హాజరుకానున్నారు. కుటుంబ సమేతంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3.30 కు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 4.20 గంటలకు చంద్రబాబు కడపకు రానున్నారు.
కడప విమానశ్రయం నుంచి ఒంటిమిట్ట టీటిడి గెస్ట్ కు చేరుకొని అక్కడే బస చేయనున్నారు. సాయంకాలం 6 గంటలకు ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయానికి చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
అనంతరం సాయంత్రం 6.30 గంటలకు కల్యాణ వేదిక వద్దకు వెళ్లి కోదండరామ స్వామి కల్యాణంలో పాల్గొంటారు. కళ్యాణం అనంతరం 8.30 కు టీటిడి గెస్ట్ హౌస్ కు వెళ్లి రాత్రి బస చేస్తారు. 12 వ తేది ఉదయం 8.50 కు ఒంటిమిట్ట నుంచి కడప విమానాశ్రయం బయల్దేరి 9.30 కు విజయవాడ బయల్దేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.