మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు దశాబ్దాలకు పైగా తన నటన, డాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్నారు. ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖైదీ నెం.150.. వంటి ఎన్నో బ్లాక్బస్టర్లతో అభిమానులను మెప్పించారు. ఇక చిరంజీవి తాజా మూవీ.. ‘విశ్వంభర’ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వైరల్ అవుతోంది. చిరంజీవి విశ్వంభర చిత్రానికి బింబిసారతో మంచి హిట్ అందుకున్న.. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం సోషియో-ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన నేపథ్యం, అత్యాధునిక సాంకేతికతతో ఈ చిత్రం ఈ ఏడాది జూలై 24న విడుదల కానుంది. ఈ పవర్‌పుల్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ సింగిల్ ‘రామ రామ ను హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పవిత్ర గీతానికి ఎంఎం కీరవాణి ఆధ్యాత్మికత నింపిన సంగీతాన్ని అందించారు. శంకర్ మహదేవన్ గొంతుతో ఈ పాట మరింత ప్రాణం పొంది, శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఈ పాటలో హనుమంతుడి భక్తి, రామునిపై నిబద్ధత వంటి అంశాలు అద్భుతంగా పొందుపరిచారు. శోభి మాస్టర్ – లలిత మాస్టర్స్ అందించిన కొరియోగ్రఫీ, చిరంజీవి ఎనర్జీ ఫుల్ స్టెప్పులు పాటకు విశేష ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి ఎక్కింది. ఈ మూవీకి సినిమాటోగ్రఫీని చొటా కె. నాయుడు నిర్వహిస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్‌పై భారీ ఖర్చు చేస్తున్నారు. ఈ చిత్రం పవిత్రమైన పురాణ గాధలు, ఆధునిక టెక్నాలజీకి మిళితంగా ఉండబోతోందని ఇండస్ట్రీలో టాక్. శైవత, వైష్ణవ అంశాలు, దేవతల నేపథ్యం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుండడం విశేషం. చిరంజీవి మరోసారి భారీ తలుపులు తట్టే బ్లాక్‌బస్టర్ హిట్‌కు రెడీ అవుతున్నారు.