వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం, అంతర్గత అమరికలు సరిగ్గా లేకపోతే జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పడకగదిలో కొన్ని అంశాలపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం, పడకగదిలో ఈ వస్తువులు ఉండకూడదు అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
చనిపోయిన బంధువుల చిత్రాలను పడకగదిలో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి భావోద్వేగాలకు గురిచేసి, నెగిటివ్ ఎనర్జీకి దారితీస్తాయంట. దీనితో పాటు ఇంట్లో దేవుడికి ప్రత్యేకంగా పూజా గది ఉండాలని, పడకగదిలో మాత్రం దేవుని చిత్రాలు లేదా విగ్రహాలు ఉంచరాదని సూచిస్తున్నారు. ఇక బెడ్‌రూమ్ గోడలకు ముదురు రంగులు వాడితే, అది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని, వెలుతురు తగ్గి అణచివేత భావన కలగవచ్చని చెబుతున్నారు.
ఇక పగిలిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు పడకగదిలో అస్సలు ఉండకూడదంట. ఇవి ఆర్థిక సమస్యలు కి సంకేతాలుగా భావిస్తారు. వీటిని వెంటనే తొలగించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇక బెడ్‌కి ఎదురుగా అద్దం ఉంటే రాత్రి సమయంలో ప్రతిబింబం చూసి భయభ్రాంతులకు గురికావచ్చు. ఇది మనసులో అసౌకర్యం కలిగించే అవకాశం ఉందని.. అందుకే బెడ్ రూమ్ లో అద్దం లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదే కాకుండా పడక గదిలో గుండ్రని ఫర్నీచర్ ఉండకూడదని చెబుతున్నారు.. ఇది అసమతుల్యతకు సంకేతాలని, గదిలో శాంతి మరియు స్థిరత్వాన్ని దెబ్బతీయొచ్చని చెబుతున్నారు. బెడ్ కింద పదార్థాలు లేదా వంటకాలు ఉంచడం వలన శుభత కలుగదని, అలాగే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని నిపుణుల హెచ్చరిక.
పాటించవలసిన కొన్ని సూచనలు:
ఇక జీవితం ప్రశాంతంగా సాగాలంటే జీవిత భాగస్వామి ఫోటోను నైరుతి దిశలో ఉంచాలని సూచిస్తున్నారు పండితులు. ప్రేమ పక్షులు లేదా జంటల చిత్రాలు బెడ్‌రూమ్ లో ఉంచడం వల్ల సానుకూలత పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఇక బెడ్ రూమ్ లో అల్మారాలను ఈశాన్య దిశలో కాకుండా ఇతర దిశలో ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు పండితులు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)