Wednesday, April 16, 2025
Homeచిత్ర ప్రభటెడ్ టాక్‌లో గ్రేట్ పర్సనాలిటీస్‌ లిస్ట్‌లో ఎంపికైన ఆదిత్య ఓం..!

టెడ్ టాక్‌లో గ్రేట్ పర్సనాలిటీస్‌ లిస్ట్‌లో ఎంపికైన ఆదిత్య ఓం..!

ఆదిత్య ఓం దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా చెరగని ముద్ర వేశాడు. సామాజిక సేవల్లోనూ ఆదిత్య ఓం ముందుంటారు. మానవతావాదిగా ఆదిత్య ఓం అందరికీ సహాయ పడుతుంటాడు. అలాంటి ఆదిత్య ఓం తాజాగా బందీ అనే చిత్రంతో అందరినీ మెప్పించారు. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. మంచి సందేశాత్మాక చిత్రంతో, సామాజిక అవగాహన కల్పించే చిత్రంతో ఆదిత్య ఓం అందరినీ ఆకట్టుకున్నారు.

- Advertisement -

తాజాగా ఆదిత్య ఓం టెడ్ టాక్ నుంచి ఎంపికైన గ్రేట్ పర్సనాలిటీస్‌ లిస్ట్‌లో ఎంపికయ్యారు. ‘ఇన్వాల్వ్ అండ్ ఎవాల్వ్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ‘సినిమా యాజ్ ఎ టూల్ ఆఫ్ ఇన్‌క్లూజివిటీ అండ్ థింక్ ఎవల్యూషన్’ అనే అంశంపై ఆయన ఇచ్చి ప్రసంగానికి అందరూ ఫిదా అయ్యారు. ఆయన ప్రజెంటేషన్ చూసి అంతా స్టాండింగ్ ఓవియేషన్‌తో అభినందించారు.

సామాజిక కార్యకర్తగా కొన్నేళ్ల నుంచి ఏన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక సినిమాలతోనూ ఎంతో కొంత మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే షణ్ముఖ అనే చిత్రంలో కొత్త ఆదిత్య ఓంను చూడబోతోన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News