Saturday, April 19, 2025
HomeఆటKarun Nair: వాట్ ఏ కమ్‌ బ్యాక్.. వాట్ ఏ బ్యాటింగ్

Karun Nair: వాట్ ఏ కమ్‌ బ్యాక్.. వాట్ ఏ బ్యాటింగ్

టీమిండియా మాజీ ఆటగాడు కరుణ్‌ నాయర్‌(Karun Nair) కమ్ బ్యాక్ గురించి ఇప్పుడు క్రికెట్ అభిమానులందరూ మాట్లాడుకుంటున్నారు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసినా జట్టులో స్థానం పదిలం కాలేదు.. దేశవాళీ టోర్నీలో సెంచరీల మోత మోగించినా భారత జట్టులోకి పిలుపు రాలేదు. అయితే మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన అవకాశంతో కరుణ్ నాయర్ ఇచ్చిన కమ్ బ్యాక్ అదిరిపోయింది.

- Advertisement -

ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన కరుణ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో దుమ్మురేపిన నాయర్‌ను ఢిల్లీ జట్టు దక్కించుకుంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలో దించింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన కరుణ్.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల్లా పట్టుకున్నాడు. తొలి బంతి నుంచే ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టాడు.

ముఖ్యంగా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ను చీల్చిచెండాడు. బుమ్రా వేసిన తొమ్మిది బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇక కేవలం 40 బంతుల్లోనే 12 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. 222.50 స్ట్రయిక్‌ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన బ్యాట్స్‌మెన్‌ సాధించిన రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఆరు సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్‌లో కరుణ్ నాయర్ అర్ధ సెంచరీ చేయడం గమనార్హం. అయితే కరుణ్‌ అద్భుతంగా రాణించినా.. మిగతా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమిపాలైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News