Sunday, June 8, 2025
HomeతెలంగాణSC Classification: తెలంగాణ ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

SC Classification: తెలంగాణ ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ(SC Classification) జీవోను న్యాయశాఖ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణపై ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. ఈ నెల 8న ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్‌ బిష్షుదేవ్ వర్మ ఆమోదించారు.

- Advertisement -

దీని ప్రకారం మొత్తం 59 ఎస్సీ ఉపకులాలను మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఇందులో గ్రూప్ 1 – అన్ని విధాలా అత్యంత వెనుకబడిన కులాలు, గ్రూప్ 2 – మధ్యస్థ స్థితిలో ఉన్న లబ్దిపొందిన కులాలు, గ్రూప్ 3 – మెరుగైన స్థితిలో ఉన్న ఉపకులాలు ఉండనున్నాయి.

సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్‌-ఏ కింద ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించారు. అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉప కులాలకు గ్రూప్‌-బీ కింద ఉన్న వారికి 9 శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కులాలను గ్రూప్‌-సీ కింద ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News